అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా..
పల్లెల్లో పట్టుకు ప్రధాన రాజకీయ పార్టీల ప్రయత్నాలు గ్రామాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల పర్యటనలు
పెద్దపల్లిరూరల్: పంచాయతీల్లో పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 263 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తొలివిడత పూర్తయ్యింది. ఆదివారం రెండోవిడత పోలింగ్ నిర్వహిస్తారు.
పార్టీ రహితమైనా..
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతున్నా.. అభ్యర్థులు ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వారే కావడం గమనార్హం. తొలివిడతలో 5 మండలాల్లోని 99 పంచాయతీలు, 896 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులే అత్యధికంగా 70 స్థా నాల్లో విజయం సాధించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ 22 పంచాయతీలకే పరిమితమైంది. మరో ఏడు గురు స్వతంత్రులు కూడా సత్తాచాటారు.
రేపే మలివిడత ఎన్నికలు..
జిల్లాలోని పాలకుర్తి మండలంలో 16, అంతర్గాంలో 15, ధర్మారంలో 29, జూలపల్లి మండలంలోని 13 పంచాయతీలు, 684 వార్డులకు ఈనెల 14న (ఆదివారం) పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత ఫలితా లను విశ్లేషించుకున్న నేతలు.. రెండోవిడతకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
చివరి విడతలో పెద్దపల్లి సెగ్మెంట్..
పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలోని కాల్వశ్రీరాంపూర్ మండలంలోని 24 పంచాయతీలకు తొలివిడత గురువారం ఎన్నికలు జరిగాయి. 18 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో బీఆర్‌ఎస్ ఐదు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈనెల 17న పెద్దపల్లి మండలంలోని 30 పంచాయతీలు, సుల్తానాబాద్‌లోని 27, ఎలిగేడులోని 12, ఓదెల మండలంలోని 22 పంచాయతీలు, 852 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
పోటాపోటీగా వ్యూహాలు..
తొలివిడత ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి ఊపు మీదున్న కాంగ్రెస్‌ను కట్టడి చేసి పల్లెస్థాయి నుంచే పట్టు సాధించాలన్న ఆలోచనతో బీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. చివరి విడత పోరులో అక్క డక్కడా సర్పంచ్ స్థానం కోసం ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండడంతో ఆ ఊళ్ల జోలికి వెళ్లకుండా.. ‘ఎవరు గెలిచిన మనోళ్లే’.. అన్న ధోరణిని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రదర్శిస్తున్నారు. మిగతా గ్రామాల్లో పోటీ తీవ్రతను బట్టి ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో పర్యటించి తమ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నా రు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సైతం ఎలాగైనా త మ మద్దతు దారులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకునేందుకు అభ్యర్థులతో సమావేశాలను నిర్వ హించి పలు సూచనలు చేశారు. ఇలా వ్యూహ, ప్రతివ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రచారహోరు సా గిస్తుండగా..బీజేపీ నేతల్లో నెలకొన్న అంతర్గత విభేదాలతో ఎవరికి వారే యమునాతీరే అన్నరీతిన వ్య వహరిస్తున్నారు. పెద్దపల్లి మండలంలో రెండు పంచాయతీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటా మని నేతలు పట్టుదలతో పనిచేస్తున్నారు.
హోరెత్తుతున్న ప్రచారం..
జిల్లాలో గ్రాయ పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కేవలం ఐదారువందల ఓట్లు ఉన్న పంచాయతీలో పోటీపడే వారు సైతం ప్రచార రథాలతో వాడవాడలా ప్రచారం చేయడం గమనార్హం. దీనిని బట్టి నాలుగైదువేల మంది ఓటర్లున్న పెద్దపంచాయతీల్లో ప్రచారం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తొలివిడతలో హస్తం విసిరిన పంజాతో డీలా పడ్డ విపక్ష పార్టీలు రెండు, మూడోవిడత ఎన్నికల్లో సత్తాను ఏమేర చాటుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


