అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ధర్మారం(ధర్మపురి): అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని నర్సింహులపల్లి, ఖిలావనపర్తి, పైడిచింతలపల్లి, బుచ్చయ్యపల్లె, ఖానంపల్లి, దొంగతుర్తి గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


