కాంగ్రెస్ సర్కారుతోనే పేదలకు మేలు
పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో గురువారం పార్టీ గ్రామ అధ్యక్షుడు గొడ్డేటి రాజయ్య, మార్కెట్‌కమిటీ డైరెక్టర్ గౌస్‌మియా, తలారిసాగర్, లక్ష్మినారాయణ, చంద్రయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామంలో మహిళాసంఘ భవనం నిర్మించాలని మహిళలు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. రోడ్ల అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి
జూలపల్లి(పెద్దపల్లి): గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతోనే సాధ్యమని ఎమ్మెల్యే విజయరమణారావు ఆన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు నాగులపల్లె తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. నాయకులు దారవేని నర్సింహయాదవ్, రాజేశం, రాంచంద్రం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


