21న జాతీయ లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

21న జాతీయ లోక్‌అదాలత్‌

Dec 12 2025 6:05 AM | Updated on Dec 12 2025 6:05 AM

21న జ

21న జాతీయ లోక్‌అదాలత్‌

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: న్యాయస్థానాల్లో పేరుకుపోయిన పెండింగ్‌ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు వీలుగా ఈనెల 21న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. జిల్లా న్యాయస్థానంలో గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధానకార్యదర్శి భవాని, సీనియర్‌ సివిల్‌జడ్జి స్వప్నరాణి, జూనియర్‌ సివిల్‌జడ్జి మంజులతో కలిసి పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ నెల 13న నిర్వహించాల్సిన జాతీయ లోక్‌అదాలత్‌ను పంచాయతీ ఎన్నికల కారణంగా 21న నిర్వహిస్తామని పేర్కొన్నారు. లోక్‌అదాలత్‌లో సివిల్‌, క్రిమినల్‌, బ్యాంకు రికవరీ, ఇన్సూరెన్సు క్లెయి మ్‌, కుటుంబ తగాదాలకు సంబంధించి కేసులను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అవకాశముందన్నారు. న్యాయసేవలను ఉచి తంగా పొందాలనుకునే వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు.

ప్రశాంతంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలు

పెద్దపల్లి: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 82.27 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లాలోని 5 మండలాల పరిధిలో ఎన్నికలు జరుగగా, కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని, 1,18,346 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వివరించారు. డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

నగరంలో పారిశుధ్యం మెరుగుపర్చండి

కోల్‌సిటీ(రామగుండం): నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన రెండుపూటల శానిటేషన్‌ విధానం ద్వారా పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపర్చాలని రామగుండం నగరపాలక కమిషనర్‌ జె.అరుణశ్రీ ఆదేశించారు. గురువారం కార్యాలయంలో పారిశుధ్య విభాగం సూపర్‌వైవర్లు, వార్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అదనంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్నం షిఫ్ట్‌లో పారిశుధ్య సిబ్బందితో టీమ్‌ వర్క్‌ చేయించాలన్నారు. సిబ్బంది హాజరు, పని తీరును వార్డు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సిబ్బంది తమకు కేటాయించిన డివిజన్లలోనే పని చేయాలని, ప్రతీ స్వచ్ఛ ఆటో తప్పనిసరిగా డీఆర్‌సీ, కంపోస్ట్‌యార్డ్‌కు వెళ్లాలన్నారు. అడిషనల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌, ఎస్‌ఈ గురువీర, ఈఈ రామన్‌, డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, సెక్రెటరీ ఉమామహేశ్వర్‌రావు, ఆర్‌వో ఆంజనేయులు, డీఈలు శాంతిస్వరూప్‌, జమీల్‌, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, సంపత్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీపాల్‌, ఎన్విరాన్మెంటల్‌ ఇంజనీర్‌ మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రీయ విద్యాలయాలు.. ఉన్నత విద్యకు సోపానాలు

జ్యోతినగర్‌(రామగుండం): కేంద్రీయ విద్యాలయాలు ఉన్నత విద్యకు సోపానాలుగా నిలుస్తున్నాయని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, విద్యాలయ మేనేజ్‌మెంట్‌ చైర్మన్‌ చందన్‌కుమార్‌ సామంత అన్నారు. గురువారం ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లో కేంద్రీయ విద్యాలయ వార్షిక క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎన్టీపీసీ నిర్వహించిన సైబర్‌ సెక్యూరిటీ అంశం, వివిధ క్రీడల్లో విజయం సాధించినవారికి జ్ఞాపికలు అందజేశారు. ఏజీఎం బిజ య్‌ కుమార్‌ సిగ్దర్‌, ధన్వంతరి ఆస్పత్రి సీఎంవో డాక్టర్‌ లహరి, రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ రవి, విద్యాలయ ప్రిన్సిపాల్‌ శోభన్‌బాబు పాల్గొన్నారు.

21న జాతీయ లోక్‌అదాలత్‌1
1/2

21న జాతీయ లోక్‌అదాలత్‌

21న జాతీయ లోక్‌అదాలత్‌2
2/2

21న జాతీయ లోక్‌అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement