ప్రజల కోసం హెల్ప్‌డెస్క్
పెద్దపల్లి: లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్‌ను ప్రజ లు వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ శ్రీధర్‌తో కలిసి లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్‌ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. వైద్యసేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
ఓదెలలో స్థల పరిశీలన
ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రంలో జూనియ ర్ సబ్‌కోర్డు పక్కా భవన నిర్మాణానికి సుల్తానాబాద్ కోర్డు జడ్జి గణేశ్ శుక్రవారం ఓదెలలో స్థల పరిశీలన చేశారు. ఎస్సారెస్పీ కార్యాలయం స మీపంలోని 1.5ఎకరాల్లో భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు హద్దులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ధీరజ్‌కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.
నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
పెద్దపల్లి: ఆరో తరగతిలో ప్రవేశాల కోసం శని వారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జవహర్ నవోదయ పరీక్ష నిర్వహిస్తారని డీఈవో శారద తెలిపారు. ఉమ్మ డి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6,892 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. విద్యార్థుకు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆమె సూచించారు.
ఎన్టీపీసీలో ఓపెన్‌హౌస్ ఫోరం
జ్యోతినగర్(రామగుండం): ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ పరిపాలన భవనంలో శుక్రవారం ఓపెన్ ఫోరం హౌస్ నిర్వహించారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు. అధికారులు, ఉద్యోగులు సంస్థాగత ప్రభావంపై పలు సూ చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాఽధికారులు, అధికారులు, వివిధ యూనియన్ల ప్రతి నిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో విశ్వం ఎడ్యు టెక్ ఆధ్వర్యంలో అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ జిల్లాస్థాయి పోటీలు శుక్రవారం జరిగాయి. ప లు ప్రాంతాల నుంచి 40 పాఠశాలలకు చెందిన 500 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 31 మంది ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలు జనవరిలో ఉంటాయని రీజినల్‌హెడ్ వినాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు స్రవంతి, సురేందర్, సాగర్, నాగరాజు, కిశోర్, శివ, సూరజ్ పాల్గొన్నారు.
ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
రామగుండం: రెండోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ బందోబస్తు చేపట్టామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. ఓటర్లపై ఒత్తిడి తేవొద్దన్నారు. అంతర్గాం మండలం గోలివాడలో శుక్రవారం ఆయన అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్, అంతర్గాం ఎస్సై వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,431
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,431 ధర పలికింది. కనిష్టంగా రూ. 6,878, సగటు రూ.7,211గా ధర నిర్ణయించినట్లు మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి రైతులు తీసుకొచ్చిన 532 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.
సూచనలిస్తున్న డీసీపీ రాంరెడ్డి
ప్రజల కోసం హెల్ప్‌డెస్క్
ప్రజల కోసం హెల్ప్‌డెస్క్
ప్రజల కోసం హెల్ప్‌డెస్క్


