పెరిగిన చలితీవ్రత
● 8.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
జ్యోతినగర్(రామగుండం): జిల్లాలో చలితీవ్రత పెరుగుతోంది. రామగిరి మండలంలోని సింగరేణి ఆర్జీ–3 ఏరియాలోగల ముల్కలపల్లి గ్రామంలో శుక్రవారం గరిష్టంగా 29.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 8.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలితీవ్రత పెరిగి జిల్లావాసులు వణిపోయారు. వారంరోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో రోజూ సాయంత్రం ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. జన సంచారం లేక ప్రధాన రహదారులు అన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలితీవ్రతతో ఇప్పటికే చాలామంది జ్వరం, జలుబు తదితర సీజనల్ వ్యాధుల తో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధు లు, దీర్ఘకాలిక, శ్వాసకోక, ఆస్తమా తదితర వ్యాధిగ్రస్తులు ఇళ్లనుంచి బయటకు వెళ్లకూడదని వైద్యు లు సూచిస్తున్నారు.
జిల్లాలో శుక్రవారం నమోదైన
ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్)
ప్రాంతం గరిష్టం కనిష్టం
ముల్కలపల్లి 29.4 8.5
కమాన్‌పూర్ 31.4 9.4
ఓదెల 30.4 9.5
ఎక్లాస్‌పూర్ 30.2 9.7
కూనారం 29.1 9.9
ధర్మారం 31.5 9.9
కనుకుల 29.9 10.0


