పంచాయతీల్లో వెన్నుపోట్లు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో వెన్నుపోట్లు

Dec 13 2025 7:23 AM | Updated on Dec 13 2025 7:23 AM

పంచాయ

పంచాయతీల్లో వెన్నుపోట్లు

● ఒకరికి మాటిచ్చి.. మరొకరికి ఓటు ● పల్లెల్లో ఆసక్తికరంగా చర్చలు

పొద్దున ప్రచారం.. రాత్రి విందు

మంథని: తొలివిడత పంచాయ తీ పోరులో చిత్రవిచిత్రాలు చో టుచేసుకున్నాయి. సర్పంచ్‌ అభ్యర్థుల ఎత్తులు, పైఎత్తులకు ఓటర్లు వెన్నుపోటు పొడిచారు. అనేక ప్రలోభాలకు గురిచేసిన వారుకూడా చివరకు ఓటమి చవిచూడటంతో ఆసక్తికర చర్చ సా గుతోంది. ‘మీకే ఓటేస్తమని మా టిచ్చి ఇచ్చినకాడికి పుచ్చుకుని చేతిలో చెయ్యేసి బంధుత్వాలు, స్నేహాలు వలకబోసి నిండా ముంచార’ని ఓడిన అభ్యర్థులు తిట్ల పురాణాలు అందుకుంటున్నారు.

పైసలు పంచినా మద్దతు రాకపాయే..

పైసలు పంచినా ఓటర్లు తమకు మద్దతు ఇవ్వక మరొకరిని ఆదరించి వెన్నుపోటు పొడిచినట్లు ఓటమి పాలైనవారు ఆవేదన చెందుతున్నారు. పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో కొంద రు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకుని, తాకట్టు పెట్టి మరీ రూ.లక్షల్లో ధారపోశారు. కానీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో బరిలో నిలిచినవారు లబోదిబో మంటున్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు డబ్బుల ప్రభావం చూపుతుందని తెలిసిన కొందరు అభ్యర్థులు పోటాపోటీగా పంపిణీ చేసినట్లు తెలిస్తోంది. అయితే ముందుగా డబ్బులు తీసుకున్న ఓటర్లు ‘మీకే ఓటు వేస్తాం’ అని హామీ ఇచ్చి మరోకరు ఎక్కువ సొమ్ము ఆ వ్యక్తి ఓటు వేసినట్లు చర్చించుకుంటున్నారు. రూ.లక్షల్లో అప్పులు చేసిన అభ్యర్థులు ఓటమి తర్వాత వాటిని ఎలా తీర్చాలని తలలు పట్టుకుంటున్నారు. ఎ న్నికలకు ముందు వాగ్ధానాలు ఇ చ్చి అధికారంలోకి వచ్చాక మా టమార్చే నాయకులనే చూశాం.. కానీ ప్రస్తుతం నాయకులను మించి ఓటర్లు తయారయ్యారనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

మావోడు ఒక్క ఓటేస్తే..

‘మావోడు వచ్చి ఒక్క ఓటేస్తే నేను గెలిచటోన్ని’ అని ఓ అభ్యర్థి.. ‘నాతోటి తిరిగినోడు పక్కోడికి ఓటు వేయడంతోనే నేను ఓడిపోయా’ అని మరోఅభ్యర్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నావోళ్లని నమ్మితే పరాయోడికి ఓటు వేసిండ’ని ఇంకో అభ్యర్థి వాపోయారు. అనేక గ్రామ పంచాయతీల్లో ఒక్కఓటు కీలకమై అభ్యర్థుల తలరాతనే మార్చేసింది. తొలివిడత ఎన్నికల్లో ఓ పంచాయతీలో ఇద్దరికి సమానంగా ఓట్లు రాగా డ్రా తీయడంతో ఒకరు గెలిచారు. అలాగే మరో పంచాయతీలో కేవలం ఒక్క ఓటుతోనే సమీప అభ్యర్థి విజయం సాధించారు.

గెలుపు అంచుల వరకు వచ్చి..

మంథని డివిజన్‌లోని కొందరు సర్పంచ్‌ అభ్యర్థులు విజయావకాశాల అంచుల వరకు వచ్చి ఒక్కఓ టు తేడాతో ఓడిపోయారు. ఇలాంటి వారు దుఃఖంలో ఉంటే.. గెలిచిన అభ్యర్థులు సంబురాల్లో మునిగితేలారు. కేవలం ఒక్కఓటు అభ్యర్థి తలరాతను మార్చుతుందని దీనిద్వారా మరోసారి తేలిపోయిందనే చర్చ సాగుతోంది.

వేడెక్కిన రెండోవిడత పంచాయతీ

పెద్దపల్లిరూరల్‌: వణికిస్తున్న చలికాలంలోనూ తొ లివిడత పంచాయతీ ఎన్నికలు పల్లెవాసుల్లో వేడి పుట్టించాయి. అదేవిధంగా రెండోవిడతలోనూ గ రంగరంగా ఎన్నికల ప్రచారం సాగింది. మూడో విడత రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల్లో ఎ వరు గెలుస్తరు.. కుల ఓట్లు ఎవరివి ఎక్కువున్నయ్‌.. అందరూ కట్టడిగనే ఉంటరా?.. ఇలా తుదివిడత ఎన్నికలు జరిగే పల్లెల్లో పంచాయతీ ముచ్చట్లే వినబడుతున్నాయి. పెద్దపల్లి, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్‌ మండలాల్లోని 85 సర్పంచ్‌, 636 వార్డులకు ఈనెల 17న పోలింగ్‌ నిర్వహిస్తారు. పట్టణాలకు సమీపంలోని మేజర్‌ పంచాయతీల్లో పోరు ‘నువ్వా.. నేనా’ అన్నట్లుంది.

పొద్దంతా ఎన్నికల ప్రచారం..

అభ్యర్థులు తమ ఆధిపత్యం చూపించి అధికారం దక్కించుకునేందుకు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. మూడో విడతకు కొద్దిరోజులే గడువు ఉండడంతో ఉదయం నుంచే ప్రచారం జోరుగా చేస్తూ తమ గుర్తును ఓటర్ల ముంగిటకు చేర్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. పొద్దంతా ప్రచారం చేసి.. మద్దతుదారులతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాత్రివేళల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు.

స్టేటస్‌లు.. వాట్సాప్‌ గ్రూపుల్లో..

ఈసారి పంచాయతీ ఎన్నికల ప్రచారం ‘డిజిటల్‌’ మయమైంది. సర్పంచ్‌, వార్డు స్థానా ల్లోని అభ్యర్థులు సోషల్‌మీడియా ద్వారా ప్రచా రం హోరెత్తిస్తున్నారు. వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియే ట్‌ చేస్తూ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు.

కుల బలం కోసం..

అభ్యర్థులు తమ కుల బాంధవులతో సమావేశా లు జరిపి మద్దతునివ్వాలని అభ్యర్థిస్తున్నారు. పె ద్దపల్లి మండలంలోని ఓ పల్లెలో తమ ఆరాధ్య దైవం గల ఆలయాన్ని రూ.30లక్షలతో అభివృద్ధి చేసేందుకు బాండ్‌ రాసివ్వడంతో కులబలగమంత సదరు అభ్యర్థికి బాసటగా నిలుస్తున్నట్లు స మాచారం. మరోఊరులో.. తమ కాలనీ రోడ్డు అ ధ్వానంగా ఉందని, గెలిచిన వెంటనే రోడ్డు వేయిస్తానని ఓ వార్డు అభ్యర్థి బాండ్‌ రాసిచ్చినట్లు తెలిసింది. ఇలా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. కా నీ, ఓటరు మహాశయుడి కరుణ ఎవరిపై ఉందో ననే విషయం ఈనెల 17న తేలిపోనుంది.

పంచాయతీల్లో వెన్నుపోట్లు 1
1/1

పంచాయతీల్లో వెన్నుపోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement