ఘనంగా దీక్షా దివస్
గోదావరిఖని: దీక్షా దివస్‌ను స్థానిక ప్రధాన చౌరస్తా లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. తెలంగాణ అమరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మూల విజయరెడ్డి, పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, గాధం విజయ, బాదే అంజలి, చెలకలపల్లి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
మంథనిలో..
మంథని/మంథనిరూరల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలకమలుపు తిరిగిన డిసెంబర్ 9న తెలంగాణ విజయ్ దివస్‌ను బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పూలమాలలు వేసి వేడుకలను నిర్వహించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గిన అప్పటి కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని గుర్తుచేశారు. భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కమాన్‌పూర్ మాజీ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, నాయకులు తగరం శంకర్‌లాల్, రాజుగౌడ్, పుప్పా ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
24 పైసల పనికూడా చేయని ఎమ్మెల్యే..
మంత్రిగా మంథని ఎమ్మెల్యే 24 నెలల్లో 24 పైసల పనికూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూ కర్ ఆరోపించారు. అడవిసోమన్‌పల్లిలోని వంతెన ను ఆయన పరిశీలించి మాట్లాడారు. వంతెనకు ఒకవైపే.. అదికూడా సగం వరకు సున్నం వేసి మరోపక్క విస్మరించారని దుయ్యబట్టారు. పీవీ హయాంలో అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి నిర్మించారని, ఆ తర్వాత ఒక్కటి కూడా నిర్మించలేదని, బీఆర్‌ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనేక వంతెనలు, ప్రాజెక్టులు నిర్మించారని ఆయన గుర్తుచేశారు.


