నిరంతర తనిఖీలు
పెద్దపల్లి: జిల్లాలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. వారితోపాటు ఫ్లయింగ్ సర్వేలెన్స్ టీం, స్టార్టింగ్ సర్వేలైన్స్ బృందాలు నిరంతరం తనిఖీ లు చేస్తున్నాయి. మద్యం, నగదు అక్రమ రవాణా ను నిలువరించేందుకు యత్నిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా కట్టుదిట్టమైన చర్య లు తీసుకుంటున్నాయి.
చెక్‌పోస్టుల ఏర్పాటు
మండలాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి, గోదావరిఖని, మంథని, గుంపుల సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటుచేసిన ఉన్నతాధికారులు.. 24 గంటలపాటు నిఘా పెడుతున్నా రు. వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. సీసీ కెమెరాలతోనూ నిఘా ఉంచుతున్నారు. ఎస్సై నుంచి పోలీస్ కమిషనర్ వరకు అన్నిస్థాయిల అధికారులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగులు అప్ర మత్తంగా ఉండాలని, ఏ వాహనాన్ని కూడా వదిలిపెట్టకుండా తనిఖీ చేయాలని సూచిస్తున్నారు.
రూ.50 వేలకన్నా ఎక్కువ నగదు తీసుకెళ్లవద్దు
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. రూ.50 వేల నగదు మాత్రమే వెంట తీసుకువెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ తీసుకువెళ్తే అధికారులు సీజ్ చేస్తారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాక తగిన ఆధారాలు చూపిస్తే వదిలిపెడతారు. రూ.10,000 విలువైన ఒకేరకం వస్తుసామగ్రి రవాణా చేసినా వివరణ ఇవ్వాల్సిందే. గంపగుత్తగా చీరలు, మద్యం వంటివి తీసుకెళ్లినా అధికారులు ఆధారాలు అడుగుతారు.
ఫిర్యాదులు చేసే అవకాశం
మండలానికి ఒకటి చొప్పున జిల్లాలోని 13 మండలాలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలు, నియమావళి అమలు చేయకపోవడం వంటి ఫిర్యాదులపై ఈ బృందాలు తక్షణం స్పందిస్తాయి.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి
జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీ స్ అధికారులు నివేదిక తయారు చేశారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. తొలివిడతలో ఈనెల 11న కాల్వశ్రీరాంపూర్, రామగిరి, మంథని, ముత్తారం, కమాన్‌పూర్ మండలాలు, రెండోవిడత(ఈనెల 14న)లో పాలకుర్తి అంతర్గాం, ధర్మారం, జూలపల్లిలో, మూడో విడత(ఈనెల 17న)లో సు ల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల లోని పంచాయతీల్లో పోలింగ్ నిర్వహిస్తారు.
సరిహద్దుల్లో చెక్‌పోస్టులు
నిత్యం సోదాలు చేస్తున్న వైనం
రంగంలోకి పోలీసులు
ప్రత్యేక అధికారులు కూడా..


