విద్యార్థులకు అభినందన
పెద్దపల్లిరూరల్: జిల్లా ఉపాధికల్పనాధికారి కా ర్యాలయం, టాస్క్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వ హించిన జాబ్‌మేళాలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన 8 మంది విద్యార్థులు పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. దీంతో ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య సోమవారం విద్యార్థులను అభినందించారు. టాస్క్ కో ఆర్డినేటర్ మారుతి, కౌసల్య తదితరులతో కలిసి నియామక పత్రాలను అందించారు. విద్యార్థుల్లో ప్రతిభానైపుణ్యాలను పెంపొందించేలా టాస్క్ నిర్వాహకులు అందిస్తున్న సేవలను ప్రిన్సిపాల్ ప్రశంసించారు. అధ్యాపకులు పురుషోత్తం, నారాయణ తదితరులు ఉన్నారు.
నిబంధనలు పాటించాలి
పెద్దపల్లిరూరల్: వాహనదారులు రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయ ని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో సోమవారం వాహనా ల తనిఖీ కోసం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. మద్యం, గంజాయి లాంటి మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తా మని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
పెద్దపల్లిరూరల్/కాల్వశ్రీరాంపూర్/ఓదెల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని డీసీపీ భూ క్యా రాంరెడ్డి అన్నారు. పెద్దపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన సోమవారం సందర్శించారు. కాల్వశ్రీరాంపవూర్‌లోని పలు గ్రామాలతోపా టు ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఆ యన పర్యటించారు. ఏసీపీ కృష్ణ, సీఐలు ప్రవీణ్‌కుమార్, సుబ్బారెడ్డి, ఎస్సైలు మల్లేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛగా ఓటు వేయాలి
పాలకుర్తి: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని బసంత్‌నగర్ ఎస్సై శ్రీధర్ సూచించారు. పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లిలో సోమవారం అభ్యర్థులు, స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప లు సూచనలిచ్చారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహ క్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. హెడ్‌కానిస్టేబుల్ నరేందర్‌గౌడ్, సిబ్బంది కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు వద్దు
పాలకుర్తి(రామగుండం): బాల్య వివాహాల ని ర్మూలన అందరి బాధ్యతని జెండర్ స్పెషలిస్ట్ సుచరిత అన్నారు. బసంత్‌నగర్, రాణాపూర్ గ్రామాల్లో సోమవారం జిల్లా మహిళా సాధికారిత ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూల నపై అవగాహన కల్పించారు. ఏపీఎం భా గ్యమ్మ, సీసీ రాంబాయి, ఎంఎస్ ఎంఈ కౌన్సెలర్ విజయ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఉపసంహరణకు గడువు
● అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
పెద్దపల్లిరూరల్: పంచాయతీ చివరి విడత స ర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటాపోటీ గా నామినేషన్లు దాఖలు కాగా.. వారిలో కొందరిని తమకు అనుకూలంగా ఉపసంహరించుకోవాలంటూ సాగిన బుజ్జగింపులకు మంగళవా రం తెరపడనుంది. నామినేషన్ల ఉపసంహర ణకు మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల వరకే గడువు ఉంది. ఈలోగా ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు ఉపసంహరించుకుంటారో తేలనుంది. అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత ఎన్నికల రణ రంగంలో మి గిలిన అభ్యర్థులందరికీ మంగళవారమే గుర్తు లు కేటాయిస్తారు. ఇక బుధవారం నుంచి అ భ్యర్థులు తమ గుర్తుతో ఓటర్ల వద్దకు వెళ్లి అభ్యర్థిస్తూ ప్రచారం చేయనున్నారు.
విద్యార్థులకు అభినందన
విద్యార్థులకు అభినందన
విద్యార్థులకు అభినందన


