పకడ్బందీగా ఎన్నికల విధులు
పెద్దపల్లి: రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు నర్సింహారెడ్డితో కలిసి తన కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 9న రెండోవిడత, 12న మూడోవిడత ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. పోలింగ్ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ముగిసేలా చర్యలు తీ సుకోవాలని సూచించారు. 50శాతం కన్నా ఎక్కువ వార్డుసభ్యులు అందుబాటులో ఉండేలా సమాచారం అందించాలని ఆయన అన్నారు. కార్యక్ర మంలో జెడ్పీసీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, డీఈవో శారద తదితరులు పాల్గొన్నారు.
9న ఎన్నికల సిబ్బందికి శిక్షణ
పాలకుర్తి/జూలపల్లి: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈనెల 9న నిర్వహించే శిక్షణకు ఎన్నికల సిబ్బంది సకాలంలో హాజరు కావాలని, ఎన్నికల వి ధులపై అధికారులు సంపూర్ణ అవగాహన కల్పించా లన్నారు. పాలకుర్తి, జూలపల్లి ఎంపీడీవో కార్యాలయాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలిచ్చారు. కార్య క్రమంలో ఎంపీడీవోలు శశికళ, పద్మజ, ఎంపీవోలు శేషయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
సిబ్బందికి కలెక్టర్ శ్రీహర్ష సూచన


