రక్షణే ప్రథమం.. తర్వాతే ఉత్పత్తి లక్ష్యం
గోదావరిఖని: సింగరేణిలో 56వ రక్షణ పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి. భూగర్భగనులు, ఓసీపీలు, డిపార్ట్‌మెంట్‌లు, సీహెచ్‌పీల్లో వేర్వేరుగా పోటాపోటీగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒ క్కోగనిపై అన్ని అంశాలను కమిటీలు క్షుణ్ణంగా తని ఖీ చేస్తున్నాయి. నెలరోజులుగా ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఆర్జీ–1 ఏరియాలోని జీ డీకే–5 ఓసీపీలో రక్షణ పక్షోత్సవాలు నిర్వహించా రు. ముఖ్య అతిథిగా కన్వీనర్ లక్ష్మీపతిగౌడ్, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, రీజియన్ సేఫ్టీ జీఎం మధు సూదన్ హాజరై రక్షణ జెండా ఆవిష్కరించారు. ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీఒక్కరు రక్షణలో ముందుండాలన్నారు. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తేనే సంస్థకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. ప్రతీఉద్యోగి జీరో యాక్సిడెంట్ కోసం కృషి చేయాలన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేశ్, మేనేజర్ రమేశ్‌బాబు, అనిల్‌గబాలే, పొనుగోటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రక్షణ కమిటీ తనిఖీ
జీడీకే–1,3 గనిని కమిటీ కన్వీనర్ ఆర్.విజయప్రసాద్ బృందం సోమవారం తనిఖీ చేసింది. రక్షణ చర్యలను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్మికులకు వివరించారు. భూగర్భగనిలోని పని స్థలాలకు వెళ్లి రక్షణ జాగ్రత్తలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సాయిప్రసాద్, గని ఏజెంట్ రమేశ్, డీజీఎం బి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో ప్రారంభమైన రక్షణ పక్షోత్సవాలు


