ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవాలి
కోల్‌సిటీ(రామగుండం): స్వశక్తి మహిళలు అమృత్ మిత్రలుగా పనిచేసి ఆర్థికస్థితి మెరుగు పర్చుకోవా లని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అ రుణశ్రీ సూచించార. అమృత్ మిత్రలతో వివిధ అంశాలపై తన కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ఆసక్తి ఉన్నవారిని గుర్తించి నీటి నాణ్యత ప రీక్ష, ఉద్యాన వనాల నిర్వహణ తదితర పనులు అప్పగించి, పనిగంటల ఆధారంగా వేతనం చెల్లిస్తామన్నారు. సుమారు రూ.1.20 లక్షల విలువైన పనులను అమృత్ మిత్రల ద్వారా చేపడతామని తెలిపారు. అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షాభాజ్, అసిస్టెంట్ ఇంజినీర్ తేజస్విని, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ


