చెరువంతా తామర
తామరతీగ చెరువును ముంచెత్తింది. నిత్యం జలకళతో సందర్శకులను ఆకట్టుకునే ఎల్లమ్మ చెరువు(మినీ ట్యాంక్ బండ్) తామరతీగతో నిండిపోయింది. సూర్యోదయం, సూర్యాస్తమయం సందర్భంగా సందర్శకులు పెద్దసంఖ్యలో చెరువు వాతావరణం ఆస్వాదించేందుకు వ స్తుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకున్న పర్యాటక శాఖ అధికారులు బో ట్లు తీసుకొచ్చి బోటింగ్ సౌకర్యం కల్పించారు. కొద్దిరోజులు బాగానే సాగినా.. ఆ తర్వాత తామర అవరోధంగా మారింది. స్పందించిన అధికారులు.. ఇటీవల తీగలు తొలగించేందుకు యత్నించారు. కొన్నిబోట్లను చెరువులోకి పంపించారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ.. తామరతీగ అలాగే ఉండిపోయింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


