రామగుండంలో విజిలెన్స్ దాడులు
కోల్‌సిటీ(రామగుండం): విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం రామగుండం నగర పాలక కార్యాలయంపై ఆకస్మికంగా దాడులు చేశారు. నలుగురు అధికారులు ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ తదితర విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అధికారులు, సిబ్బంది హాజరు హాజరు పట్టికను పరిశీలించి జిరాక్స్ తీసుకున్నారు. అనధికార నిర్మాణాలపై అనుమతులు, ఆస్తిపన్ను, కొలత పుస్తకాలు, టెండర్ ప్రక్రియలో లోపాలు, శానిటేషన్‌లో డీజిల్ వినియోగం నిర్వహ ణ తదితర అంశాలపై ఆరా తీశారు. నిధులు, బిల్లు లు, టెండర్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, పనుల్లో నాణ్యత వంటి అంశాలను పరిశీలించారు. బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించారు. నిర్వహణ తీరు పై అధికారును ప్రశ్నించి సమాధానాలు తెలుసుకున్నారు. డివిజన్లలో పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లతో నేరుగా మాట్లాడారు. విజిలెన్స్ దాడులతో అధికారులు, ఉద్యోగులు హడలెత్తిపోయారు.
రికార్డుల జిరాక్స్ స్వాధీనం
హడలెత్తిన బల్దియా ఉద్యోగులు


