ప్రయాణికులు.. అవస్థలు
జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి, కమాన్, కోర్టు చౌరస్తాల్లో బస్సులు ఆగేందుకు బస్‌షెల్టర్లు లేవు. వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలికి గజగజ వణుకుతూ ప్రయాణికులు బస్సుల కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు. పిల్లాపాపలతో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నా.. వీరి బాధలు పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. పెద్దపల్లి కమాన్‌చౌరస్తా వద్ద బస్సుల కోసం నిరీక్షించి.. అప్పుడే బస్సు రావడంతో పరుగులు పెడుతున్న ప్రయాణికులు ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


