ఎన్నికలు.. తనిఖీలు
జిల్లాలోని రాజీవ్ రహదారిపై
చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, పంచాయతీ ఎన్నికల్లో మద్యం, నగదు, విలువైన వస్తుసామగ్రి తరలించకుండా రాత్రింబవళ్లు వచ్చిపోయే వాహనాల్లో సోదాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అభ్యర్థులను కట్టడి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా సరిహద్దుల్లోని మొగ్దుంపూర్ రాజీవ్ రహదారిపై వాహనం తనిఖీ చేస్తున్న పోలీసులు ‘సాక్షి’కి
ఇలా కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


