కులం సర్టిఫికెట్ జారీపై నిరసన
పెద్దపల్లి: కులం సర్టిఫికెట్ జారీపై సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలోని బీసీలు శనివారం ఆందోళనకు దిగారు. కొందరు జేఏసీగా ఏర్పడి సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. ఓ మహిళ కులం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయగా.. విచారణ జరిపిన రెవెన్యూ అ ధికారులు.. బీసీ–సీ సర్టిఫికెట్ జారీచేశారని, దీంతో బీసీ మహిళకు కేటాయించిన ఆ గ్రామ సర్పంచ్ స్థానం నుంచి ఆమె పోటీలో నిలిచారని తెలిపారు. అధికార పార్టీ కుట్ర, స్థానిక ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్ జారీచేశార ని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. ఈ విషయంపై ఇన్‌చార్జి తహసీల్దార్ గిరిని సంప్రదించగా.. మత మార్పిడికి రా జ్యాంగం అనుమతిచ్చిందని, నిబంధనల ప్రకారం సదరు మహిళకు కులం సర్టిఫికెట్ జారీచేశామన్నా రు. అంతకుముందున్న ఎస్సీ కులం సర్టిఫికెట్ రద్దు కు సిఫారసే చేసినట్లు తెలిపారు. మాజీ సర్పంచులు శంకర్‌రెడ్డి, కాదాసీ చంద్రమౌళి, గుండ ము రళి, మాజీ వైస్ ఎంపీపీ ఉట్కూరి శ్రీనివాస్‌గౌడ్, శంకరయ్య, తిరుపతిగౌడ్, మహిళలు పాల్గొన్నారు.


