మెరుగైన సేవలందించాలి
పెద్దపల్లి: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైనకాలజిస్ట్ ఔట్ పేషెంట్ వద్ద సీటింగ్ సామర్థ్యం పెంచాలని, గర్భిణులు నిలబడాల్సిన అవసరం రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్‌ఎంవో డాక్టర్ విజయ్, అధికారులు పాల్గొన్నారు.
మహనీయుల జీవితం ఆదర్శం
మహనీయుల జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మాజీ సీఎం రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


