ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
ముత్తారం/రామగిరి: పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరంగ కఠిన చర్యలు ఉంటాయని పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి పేర్కొన్నా రు. గురువారం ముత్తారం మండలం ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్, ఓడెడ్, కేశనపల్లి, రామగిరి మండలం కల్వచర్ల, పన్నూర్, రత్నాపూర్, నాగెపల్లి, బేగంపేట్, రాజాపూర్, బుధవారంపేట గ్రామాల్లో
ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి జోన్ పరిధిలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడాల ని చూస్తే సహించేది లేదన్నారు. ఏదైనా సమస్య ఎ దురైతే 100కు డయల్ చేయాలని లేదా స్థానిక పో లీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని సీఐ రాజు, ఎస్సై లు రవికుమార్, శ్రీనివాస్, దివ్య, సిబ్బంది పాల్గొన్నారు.


