పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి తొలగింపు | - | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి తొలగింపు

Dec 4 2025 7:06 AM | Updated on Dec 4 2025 7:06 AM

పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి తొలగింపు

పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి తొలగింపు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అ ధ్యక్షుడు లకిడి భాస్కర్‌ను ఆ బాధ్యతల నుంచి తొ లగించారు. దీంతోపాటు కౌన్సిల్‌ సభ్యత్వాన్ని ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారు. ఈమేరకు పెద్దపల్లి బార్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా తీర్మానించిందని అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం నిర్వహించిన కౌన్సిల్‌ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడి హోదాలో భాస్కర్‌ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఠాకూర్‌ అజయ్‌ క్రాంతిసింగ్‌ను అధ్యక్షుడిగా నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్‌ న్యాయవాది సి.సత్యనారాయణరెడ్డితో పాటు దాసరి వెంకటరమణారెడ్డి, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

తీర్మానించిన కౌన్సిల్‌ కార్యవర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement