పారుపల్లి పెద్దచెరువు పరిరక్షణకు చర్యలు
ముత్తారం(మంథని): పారుపల్లి పెద్దచెరువును జిల్లా వెట్‌ల్యాండ్ కమిటీ సభ్యులు, అదనపు కలెక్టర్ వేణు, జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య బుధవా రం పరిశీలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు చెరువుల పరిరక్షణ, నీటి సామర్థ్యం పెంపుతో అటవీ జంతువులు, పక్షుల దాహం తీర్చడం లక్ష్యంగా పారుపల్లి పెద్దచెరువు పరిశీలిస్తున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు. చెరువు విస్తీర్ణం, ఆయకట్టు సాగుపై స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెరువు పరిశీలనను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేస్తారని ఆయన అన్నా రు. ఈమేరకు తాము రూపొందించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. చెరువు పరిరక్షణ కోసం స్థానికులతో కమిటీ ఏర్పా టు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బలరామ్, డీఈఈ రాజేంద్రనాథ్, తహసీల్దార్ మధూసూదన్‌రెడ్డి, స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా వెట్‌ల్యాండ్ కమిటీ వెల్లడి


