మఫ్టీలో షీటీం బృందాల నిఘా
గోదావరిఖని: మహిళల రక్షణ కోసం షీటీం బృందాలు ప్రత్యేకంగా నిఘా కొనసాగిస్తున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. మహిళలు ప్రధానంగా సామాజిక మాధ్యమాలతో జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ సూచించారు.
ప్రజల్లోనే.. ప్రజల మాదిరిగానే..
పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల పనివేళ లు ముగిసే సమయానికి ప్రజల మధ్య సాధారణ జనాల్లాగా షీటీంలు మఫ్టీలో నిఘా ఉంటాయని సీపీ తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో కేసు, గుడ్‌టచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్యవివాహాలు, మహిళా చట్టాల పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్య తలెత్తిన వెంటనే డయల్ 100కు ఫోన్‌చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. టీ సేఫ్ యాప్, మహిళల భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహ న కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. షీటీం సభ్యులు నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారని, ఆన్‌లైన్ క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీటీం 63039 23700, పెద్దపల్లి జోన్ షీ టీం 87126 59386, మంచిర్యాల జోన్ షీటీం 87126 59386 నంబర్లకు ఫోన్‌కాల్‌చేసి సందేశం పంపించాలని ఆయన సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా


