నేటినుంచి తుదివిడత నామినేషన్లు
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: మూడోవిడత పంచాయ తీ ఎన్నికల కోసం బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే తొలి, మలివిడతల్లో నామినే షన్లు స్వీకరించారు. తుదిదశలో నాలుగు మండలా ల్లోని 91 సర్పంచ్, 852 వార్డు స్థానాలకు నామి నేషన్లు స్వీకరిస్తారు. పెద్దపల్లి మండలంలోని 30 సర్పంచ్, 294 వార్డు స్థానాల కోసం 12 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓదెల మండలంలోని 22 సర్పంచ్, 198 వార్డుస్థానాలు, సుల్తానాబాద్ మండలంలోని 27 సర్పంచ్, 246 వార్డుస్థానాలు, ఎలిగేడులోని 12 సర్పంచ్, 114 వార్డుస్థానాల కోసం ఆశావహుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్టు పూర్తిచేశారు.
నోటరీ అవసరం లేదు
నామినేషన్లు దాఖలు చేస్తున్న వారు ఆ సమయంలో స్వీయప్రకటన పత్రం పూర్తిగా నింపి దాఖలు చేయాలని సుల్తానాబాద్ ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు తెలిపారు. నామినేషన్ పత్రాలతో నోటరీ జతచేయాల్సిన అవసరం లేదన్నారు. వివరాలకు క్లస్టర్‌లోని హెల్ప్‌డెస్క్, లేదా ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. కాగా, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లోని 28 నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఏసీపీ కృష్ణ తెలిపారు.
ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం


