దిగుబడి రాలె
ఈసారి ఆశించినంత పత్తి దిగుబడి రాలె. ఆకు రంగు మారింది. పూత, కాయ వచ్చినా.. దూదిగా మారలె. వానలతో వ్యాధు లు వచ్చి దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకి మూడు, నాలుగు క్వింటాళ్లు వచ్చుడు కూడా కష్టమే. మాకు ఈసారి నష్టమే.
– కల్వల తిరుపతమ్మ, కనగర్తి, పెద్దపల్లి
ఎకరంలో పండించిన
మాకు ఉన్న ఎకరంలో పత్తి సాగుచేసిన. ఇప్పుడే మొదటిసారి పత్తి తెచ్చిన. ఎప్పు డు ఏరినా నాలుగైదు బ స్తాల పత్తి వచ్చేది. ఈసారి బస్తన్నర కూడా రాలె. కానీ ఈసారి క్వింటాల్‌కు రూ.7,123 ధర పలికింది. ధర మంచిగున్నపుడు దిగుబడి రాలె.
– మానుపాటి తిరుపతమ్మ, రొంపికుంట
తగ్గిన కొనుగోలు
జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఈసారి మందగించాయి. గతేడాదితో పోల్చితే సగం కూడా సాగలేదు. దిగుబడిపై వాతావరణ ప్రభావం పడి ఉండొచ్చని అంటు న్నారు. మార్కెట్‌లో సోమవారం క్వింటాల్‌కు అత్యధికంగా రూ.7,261 ధర పలికింది.
– ప్రవీణ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి
దిగుబడి రాలె
దిగుబడి రాలె


