6లోగా దరఖాస్తు చేయాలి
పెద్దపల్లి: వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన జిల్లాలోని క్రైస్తవులు ఉత్తమ సేవకుల అవార్డుల కోసం ఈనెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలని జిల్లా ఇన్‌చార్జి మైనారిటీ సంక్షేమ అధికారి నరేశ్ కుమార్ సోమవారం తెలిపారు. సామాజిక, విద్య, వైద్యం, సాహిత్యం, కళ, క్రీడా తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారు అర్హులన్నారు. దరఖాస్తులను www.tsc mfc.in వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, పూరించాక జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, పెద్దపల్లిలోని కార్యాలయంలో సమర్పించాల న్నారు. వివరాలకు 040–23391067 నంబరు లో సంప్రదించాలని ఆయన సూచించారు.


