అవార్డు గ్రహీతకు సన్మానం
ధర్మారం(ధర్మపురి): పూలే జాతీయ అవార్జు గ్రహీత బొల్లి స్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదివారం సన్మానించారు. స్వామి చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన న్యూఢిల్లీలోని ఏపీ అంబేడ్కర్ భవన్‌లో జాతీయ అంబేడ్కర్, పూలే ఫౌండేషన్ అవార్డు అందించి గౌ రవించింది. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో స్వామిని మంత్రి అడ్లూరి సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, నాయకులు కరాటే వేణు, పాలకుర్తి రాజేశంగౌడ్ పాల్గొన్నారు.
ఏకగ్రీవమైన వారికి సత్కారం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వివిధ గ్రామాల్లో వార్డుస్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న వారిని మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం శాలువాలు కప్పి సన్మానించారు. సారయ్యగౌడ్ మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తే ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటారన్నారు. మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ సర్పంచులు సాదానందం, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌కు చెందిన విద్యార్థి చాణక్య రాష్ట్రస్థాయి గీతా పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచా డు. విజేత చాణక్యకు నిర్వాహకులు ఆదివారం జ్ఞాపిక, షీల్డ్ అందజేసి అభినందించారు.
కబడ్డీ పోటీల్లో సత్తా
గోదావరిఖని: కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లో ఈనెల 28, 29, 30వ తేదీల్లో జరిగిన కోల్‌ఇండియా స్థాయి కబడ్డీ పోటీటీల్లో సింగరేణి జట్టు రన్నర్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పోటీల్లో సింగరేణి, డబ్ల్యూసీఎల్, ఎన్‌సీఎల్, ఎంసీఎల్, ఎస్‌ఈసీఎల్, ఈసీఎల్, సీసీఎల్, బీసీసీఎల్ జట్లు పాల్గొన్నాయి. హోరాహోరిగా సాగిన ఫైనల్ పోటీల్లో మహారా ష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన డబ్లుసీఎల్ జట్టు విన్నర్‌గా నిలవగా, సింగరేణి జట్టు రన్నర్‌గా నిలిచింది. మూడోస్థానంలో ఎస్‌ఈసీఎల్ జట్టు నిలిచింది. ఈపోటీలకు ముఖ్య అతిథిగా సంస్థ సీఎండీ బలరాం హాజరయ్యారు.
అవార్డు గ్రహీతకు సన్మానం
అవార్డు గ్రహీతకు సన్మానం
అవార్డు గ్రహీతకు సన్మానం


