పారదర్శకంగా ఎన్నికలు
‘స్థానికం’పై ప్రత్యేక దృష్టి
జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు నర్సింహారెడ్డి
పెద్దపల్లి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు అనుగు నర్సింహారెడ్డి సూచించారు. క లెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. న ర్సింహారెడ్డి మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిర్ల క్ష్యం వహించొద్దన్నారు. ఎన్నికల వ్యయ వివరాల ను పకడ్బందీగా అభ్యర్థి ఖాతాలో నమోదు చేయా లని అన్నారు. అభ్యర్థులు వినూత్న రీతిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తారని, దీనిని నిరోధించేందుకు నిఘా పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. అనంతరం ఎన్నికల సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ పేపర్, ప్రింటింగ్ మెటీరియల్, బ్యాలెట్ బాక్స్, రవాణా వాహనాలు, గుర్తుల కేటాయింపు తదితర అంశాలపై ఆరా తీశారు. కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ, తొలివిడత ఈనెల 11న జిల్లా లోని 99 గ్రామాలు, 896 వార్డుల్లో ఎన్నికల నిర్వహిస్తామన్నారు. రెండోవిడత 14న జిల్లాలోని 73 గ్రా మాలు, 684 వార్డులు, మూడోవిడతలో ఈనెల 17 వ తేదీన 91 గ్రామాలు, 852 వార్డు స్థానాల్లో ఎన్నికల నిర్వహిస్తామని వివరించారు. రౌడీషీటర్లు, గత ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏసీపీ రమేశ్, జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో కాళిందిని తదితరులు పాల్గొన్నారు.


