రైల్వేట్రాక్‌కు రక్షణ గోడలు
ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – బల్హార్షా మధ్య పట్టాలకు రక్షణ గోడులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. రైలు పట్టాల నుంచి హద్దురాళ్ల వరకు వీటిని నిర్మించాలని ప్రణాళిక రూ పొందించారు. ఇందుకోసం ఇటీవల అధికారులు రూ.3,200 కోట్లు మంజూరు చేశారు. మూడోట్రాక్ ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండు పట్టాలపై ఒకేవైపు రెండురైళ్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌లతోపాటు అత్యవంతవేగవంతమైన వందేభారత్ కూడా ఈ మార్గంలోని పట్టాలపై పరుగులు పెడుతోంది.
వన్యప్రాణులు, పశువులతో ప్రమాదాలు..
రైల్వేట్రాక్‌కు ఇరువైపులా రైల్వేస్టేషన్ తర్వాత పశువులు, వన్యప్రాణులు, జీవాలు హఠాత్తుగా ట్రాక్‌లపైకి వస్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారు ల సమావేశంలో లోకోపైలెట్లు ఈ విషయాన్ని ప్ర స్తావించినట్లు సమాచారం. పశువులు, వన్యప్రాణు లు, జీవాలు ట్రాక్‌లపైకి రావడంతో ప్రమాదాలు చోటుచేసుకోవడం, రైళ్లవేగం తగ్గడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక పోతున్నామని విన్నవించారు. దీంతో రైల్వేశాఖ పట్టాల వరకు గోడలు నిర్మించాలని నిర్ణయించింది. ప్రమాదాల నియంత్రణే కాదు.. స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రక్షణ గోడలు దోహదపడతాయని భావిస్తున్నారు.
ముమ్మరంగా గోడల నిర్మాణం
కాజీపేట – బల్హార్షా మధ్య ప్రస్తుతం మూడో రైల్వేట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. రోజూ పదుల సంఖ్యలో రైళ్లు పరుగెత్తే సౌకర్యం అందుబాటులోకి వ చ్చింది. అయితే, రక్షణ గోడలు నిర్మిస్తే రైళ్ల సంఖ్య పెరిటితే సకాలంలో గమ్యస్థానం చేరుతా యని భావిస్తున్నారు. గోడల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో ఇటీవల పనులు ప్రారంభించారు. ఇవి వేగవంతంగా సాగుతున్నాయి.


