పాతబ్లాక్ రెనోవేషన్
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని పాతబ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో చేపట్టిన రెనోవేషన్ పనులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి శనివారం పరిశీలించా రు. డిసెంబర్ 31లోగా పనులు పూర్తిచేయాలని టీఎస్‌ఎంఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్, బ్లడ్ బ్యాంక్, సదరం బ్లాక్ పరిశీలించారు. కార్యక్రమంలో రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్‌ఎంవోలు కృపాబాయ్, రాజు, అధికారులు పాల్గొన్నారు.
హైస్కూల్ సందర్శన
రామగుండం: మల్యాలపల్లి జెడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళల సమస్యలపై ఆరా తీశారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
కట్టుదిట్టంగా యూరియా విక్రయాలు
పెద్దపల్లిరూరల్: పంటలకు అవసరమైన మేరకే యూరియా విక్రయించాలని, ఇందుకోసం రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష డీలర్లను ఆదేశించారు. బ్రా హ్మణపల్లి రైతువేదికలో యూరియా డీలర్లకు యా ప్‌పై కలెక్టర్ అవగాహన కల్పించారు. గతేడాది క న్నా ఈసారి 8వేల మెట్రిక్ టన్నుల యూరియా అ ధికంగా అందించినా కొరత ఏర్పడిందని, అధికారు లు జరిపిన తనిఖీల్లో అవకతవకలకు పాల్పడ్డ నలు గురు డీలర్ల దుకాణాలను సీజ్ చేశామని తెలిపారు. సాగు విస్తీర్ణం, అవసరమైన యూరియా, ఇప్పటివరకు వినియోగించింది తదితర వివరాలు యాప్‌లో నమోదై ఉంటాయని అన్నారు. రైతులు ఎక్కువ కావాలన్నా..ఆ అవకాశమే ఉండదన్నారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఏడీఏ అంజని, ఏఓ అలివేణి, డీలర్లు తదితరులు ఉన్నారు.
పనులు పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష


