చెక్‌డ్యాంను ధ్వంసం చేసిందెవరు?
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మానేరులో ప్రజాధనంతో నిర్మించిన చెక్‌డ్యాంను విధ్వంసం చేశారా? నాసిరకంతో కుంగిందా? అనే అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, దోషులపై చర్యలు తీసుకోవాలని మానేరు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అంబటి కరుణాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాసిరకం పనులు చేపట్టడడంతోనే గుంపుల చెక్‌డ్యాం ధ్వంసమైందని ఎమ్మెల్యే విజయరమణారావు అంటున్నారని, పేల్చివేతతోనే కుంగిందని అధికారులు, బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారని, దీనికి కారకులెవరో తేల్చాల్సి ఉందని వారు అన్నారు. మానేరులో ఇసుక దోపిడీపై నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు రూ.50కోట్ల జరిమానా విధించిందని వారు గుర్తు చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. వృథాగా పోతున్న నీటిని పంటలకు అందించేలా అధికారులు, పాలకులు చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చెక్‌డ్యాంలను కూల్చివేసినా.. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దోషులను గుర్తించి చర్యలు తీ సుకోకపోవడంపై సందేహాలు ఉన్నాయని, దీనిపై కలెక్టర్‌కు విన్నవించామని వారు వివరించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి
మానేరు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అంబటి కరుణాకర్‌రెడ్డి, బీజేపీ నేత సురేశ్‌రెడ్డి


