రాజ్యాంగం విలువలు ఆచరించాలి
పెద్దపల్లిరూరల్: భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకుని విలువలు ఆచరించాలని జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి కుంచాల సునీత సూచించారు. జిల్లా కేంద్రంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జడ్జి మా ట్లాడా రు. ఇతరుల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించకుండా ప్రతీపౌరుడు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని జడ్జి సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సప్నరాణితోపాటు ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీధర్, ఝాన్సీ, హనుమాన్‌సింగ్, శరత్, రమేశ్, విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్, కరస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, వైస్‌ప్రిన్సిపాల్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
అన్నికోర్టులూ ఒకేచోట
పెద్దపల్లిరూరల్: వివిధ ప్రాంతాల్లోని జూనియర్, సీనియన్ జడ్జి కోర్టులను బుధవారం జిల్లా ప్రధాన న్యాయస్థానం, సమీప అద్దెగదుల్లోకి తరలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత, సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి, జూనియర్ జడ్జి మంజుల, పెద్దపల్లి బార్‌అసోసియేషన్ సభ్యులు.. కోర్టుల ఏర్పాటు ప్రక్రియను పరిశీలించారు. కక్షిదారులు, నిందితులు, బాధితుల సౌకర్యార్థం అన్నికోర్టులను ఒకేచోటుకు చేర్చినట్లు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ తెలిపారు.
అంబేడ్కర్‌కు నివాళి
జ్యోతినగర్(రామగుండం): భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు రామగుండంలోని ఎ న్టీపీపీ ఈడీ చందన్ కుమార్ సామంత ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. బుధ వారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళి అర్పించారు. సచ్‌దేవ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విద్యార్థులు హక్కులు, విధుల సారాంశాన్ని తెలిపేలా, పౌరులను ఆ లోచింపజేసేలా స్కిట్ ప్రదర్శన చేపట్టారు.
ప్రైవేటీకరణ కోసమే నాలుగు లేబర్‌కోడ్‌లు
జ్యోతినగర్(రామగుండం): బీజేపీ సర్కార్.. ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ కోసమే నాలుగు లేబర్‌కోడ్‌లు రూపొందించిందని ఐ ఎన్‌టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా విమర్శించారు. ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎంఎస్ చెబుతున్న సొల్లు క బుర్లు కార్మికులు వినే పరిస్థితిలో లేరన్నారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాగా, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పర్యటనపై అధికారులు ప్రొటోకాల్ విస్మరించడం శోచనీయమన్నారు. దళిత ఎంపీపై వివక్ష తగదని సూచించారు. నాయకులు భూమల్ల చందర్, కోటేశ్వర్లు, ఆరెపల్లి రాజేశ్వర్, వేముల కృష్ణయ్య, బొద్దున శ్రీనివాస్, గోసిక రవి, యాదగిరి, కృష్ణమూర్తి, జమీల్, శంకర్, యాదగిరి, రాజేశ్వరావు పాల్గొన్నారు.
స్వల్పంగా పెరిగిన పత్తి ధర
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,015 ధర పలుకగా.. బుధవారం గరిష్టంగా రూ.7,111కి చేరింది. కనిష్టంగా రూ.6,088, సరాసరి రూ.6,961గా ధర నమోదైందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు.
యువతకు ఉచిత శిక్షణ
పెద్దపల్లి: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని టాస్క్ సెంటర్‌లో సాంకేతిక కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని టాస్క్ రీజినల్ సెంటర్ ఇన్‌చార్జి కౌసల్య తెలిపారు. ఆసక్తి గల యువత డిసెంబరు 6వ తేదీలోగా టాస్క్ సెంటర్‌లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. వివరాలకు 90595 06807 మొబైల్ నంబరులో సంప్రదించాలని ఆమె కోరారు.
రాజ్యాంగం విలువలు ఆచరించాలి
రాజ్యాంగం విలువలు ఆచరించాలి


