లేబర్‌కోడ్‌లను రద్దుచేయాలి
గోదావరిఖని: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌తో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బుధవారం స్థానిక సింగరేణి ఆర్జీ వన్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జేఏసీ నాయకులు కొరిమి రాజ్‌కుమార్, ఎం.శ్రీనివాస్, టి.రాజిరెడ్డి, మాదాసు రాంమూర్తి, వడ్డెపల్లి శంకర్ మాట్లాడుతూ, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలన్నారు. లేనిపక్షంలో సింగరేణిలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నాయకులు ఆరెల్లి పోషం, మాదన మహేశ్, రంగు శ్రీను, సదానందం, మెండె శ్రీనివాస్, ఆరెపెల్లి రాజమొగిలి, చె లకలపల్లి శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట..
పెద్దపల్లి: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌తో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. శ్రమశక్తినీతి– 2025 పాలసీని ఉపసంహరించుకోవాలని, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు బూడిద గణేశ్, శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల రాజారెడ్డి, వేల్పుల కుమారస్వామి, మెడే శ్రీనివాస్, డి.కొమరయ్య, సిపెల్లి రవీందర్, ఎం.రామాచారి, ఎన్.బిక్షపతి, సీహెచ్ అరవింద్, సురేశ్, తాండ్ర అంజయ్య, ఎస్.వెంకటస్వామి, ఎండీ ఖాజా, ఎం.సారయ్య, ఆరేపల్లి రాజమౌళి, హైమద్ బాషా, మాతంగి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్


