చెక్‌డ్యాం పేల్చివేసినట్లు నిరూపిస్తే రాజీనామా
కరీంనగర్ కార్పొరేషన్: పెద్దపల్లి – కరీంనగర్ జిల్లాల మధ్య మానేరుపై నిర్మించిన గుంపుల చెక్‌డ్యాంను పేల్చివేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల్లో నుంచి కూడా తప్పుకొంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట వి జయరమణారావు సవాల్ విసిరారు. చెక్‌డ్యాం కుంగిపోయిందని తాను నిరూపిస్తానని, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకొంటా రా? అని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హ రీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ప్పుడే గుంపుల చెక్‌డ్యాం నిర్మించారని అన్నారు. హుస్సేనిమియా వాగుపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదు చెక్ డ్యాంలు నిర్మిస్తే 3 కొట్టుకుపోయాయన్నారు. నా ణ్యత లోపంతోనే చెక్‌డ్యాంలు ట్టుకుపోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాంలు ఇప్పటికీ చెక్కుచెదరలేదన్నారు. అసలు ఇసుక దొంగలంటేనే కేసీఆర్ కుటుంబమని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం దాచుకున్న మూడు వేల లారీల ట్రిప్పుల ఇసుక ఇప్పటికీ మానేరు తీరంలో ఉందని అన్నారు. అందులో సంతోష్‌రావు, కవిత వాటాలు లేవా? అని ప్రశ్నించారు. నేరెళ్లలో దళితులపై కేటీఆర్ థర్డ్‌డిగ్రీ ప్రయోగించి, జైళ్లో పెట్టించింది మరిచిపోయారా? అని నిలదీశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, నాయకులు వొడితెల ప్రణవ్, ఆరెపల్లి మోహన్, మినుపాల ప్రకాశ్‌రావు, అంతటి అన్నయ్యగౌడ్, కల్లెపల్లి జానీ, గర్రెపల్లి సత్యనారాయణరావు, పడాల అజయ్, మాదాసు వెంకన్నపటేల్, గోపగాని సారయ్య, చాడ గొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, ఆకుల ప్రకాశ్, కాశెట్టి శ్రీనివాస్, చల్లోజు రాజు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సవాల్
మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు సరికాదని హితవు


