కొలనూర్‌లో పెద్దమ్మ బోనాలు
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ గ్రామంలో బుధవారం రాత్రి పెద్దమ్మతల్లి జోగుబోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల సందర్భంగా మహిళలు తలపై బోనాలు పెట్టుకుని ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు ఎంపిక
సుల్తానాబాద్‌రూరల్: గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గురుకులంలో తొ మ్మిదో తరగతి చదువుతున్న కె.స్నిగ్దిత జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. ఈనెల 11 నుంచి 15వ తేదీవరకు ఉత్తరప్రదేశ్‌లో జరిగే పోటీలకు హాజరవుతుంది. ఆమెను ప్రిన్సిపాల్ సీహెచ్ గిరిజ, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎస్.సృజన, కోచ్ సతీశ్ తదితరులు బుధవారం అభినందించారు.
కోఆర్డినేషన్ కమిటీలో చోటు
మంథని: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీలో పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకు డు, ప్రముఖ న్యాయవాది శశిభూషణ్ కాచేకు మరోసారి అవకాశం కల్పించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ మీనాక్షి నజరాజన్ అనుమతితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్.. 13 మంది సభ్యులతో నియామక ఉత్తర్వులు జారీచేశారు. అందులో శశిభూషణ్ కాచేకు చోటు కల్పించారు. మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు తదితరులకు కాచే కృతజ్ఞతలు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి రూ.కోటి
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ ఐటీఐ మైదానంలో నిత్యం వాకింగ్, వ్యాయామం చేసేవారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ఇందుకు కృషి చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలుపుతూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబురాలు చేసుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె లక్ష్మయ్య, ప్రతినిధులు రాజమల్లు, కృష్ణారెడ్డి, కొమ్ము సుధాకర్, వెంకటరెడ్డి, కొమురయ్య, అతీఫ్, వెంకటేశం, రాజమౌళి, దశరథం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రక్తనమూనాలు సేకరణ
పెద్దపల్లిరూరల్: విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో రక్తసప్తహ్ దివస్ నిర్వహించారు. పలువురి నుంచి రక్త నమునాలు సేకరించినట్లు వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి సత్యం, రాజ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దిలీప్, బొమ్మకంటి రవి, సతీశ్, సాయికుమార్, మణి, చింటు, అంజి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి అధికారుల బదిలీ
గోదావరిఖని: సింగరేణిలో అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 18 మంది మైనింగ్ అధికారులు ఉన్నారు. వీరిలో ఓసీపీ–1 అధికారి రాజశేఖర్‌ను ఓసీపీ–2కు బదిలీ చేశారు. ఓసీపీ–1కు ఇంకా ఎవరినీ నియమించలేదు. అలాగే నలుగురు ఐటీ అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది.
అరుణాచలానికి ఆర్టీసీ బస్సులు
గోదావరిఖనిటౌన్: గోదావరిఖణి నుంచి అరుణాచలం – రామేశ్వరం మధ్య ఈనెల 11న రెండు బస్సులు నడిపిస్తామని గోదావరిఖని డీపో మేనేజర్ ఎం.నాగభూషణం తెలిపారు. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశంబు, మధురై, రామేశ్వరం, విష్ణుకంచి, శివకంచి, జోగులాంబ ఆలయాల దర్శనం అనంతరం ఈనెల 18న బస్సులు గోదావరిఖని చేరుకుంటాయన్నారు. పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ.6,000 చార్జీ నిర్ణయించామన్నారు. 56789, 89898 నంబర్లు గల ఈ సర్వీసులను www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆయన కోరారు. వివరా లకు 73828 47596, 70135 04982 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
కొలనూర్‌లో పెద్దమ్మ బోనాలు
కొలనూర్‌లో పెద్దమ్మ బోనాలు


