పట్టవా?
ప్రాణాలు
పోతున్నా
ఓవర్‌లోడ్‌తో యథేచ్ఛగా వెళ్తున్న బూడిద, కంకర, కలప లోడ్ లారీలు, టిప్పర్లు
తరచూ ఘోరరోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులు, వాహనదారుల జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయి. మొన్న కర్నూలు, నిన్న చేవెళ్లలో పదుల సంఖ్యలో ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. టిప్పర్లు, లారీలు, ఆర్టీసీ బస్సులు ఫిట్నెస్‌గా ఉన్నా ఓవర్‌లోడ్‌తోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనడానికి ఈ ప్రమాదాలు నిదర్శనంగా నిలుస్తున్నాయంటున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అధ్వానమైన రోడ్లూ కారణమే అవుతున్నాయి. ఇలాంటి కారణాలు ఏవైనా సామాన్యులు బలవుతున్నారు. అయినా వాహనదారులు, ప్రజల్లో మార్పు రావడం లేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామికప్రాంతం కావడంతో బూడిద, కంకర, ఇసుక లోడ్‌తో నిత్యం వేలాది లారీలు, టిప్పర్లు ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగగిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి వెళ్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనడానికి ఈ చిత్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
ఆర్టీసీ బస్టాండ్, బస్సులో ప్రయాణికుల రద్దీ
పట్టవా?


