మహిళల రక్షణే షీటీం లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణే షీటీం లక్ష్యం

Nov 6 2025 7:30 AM | Updated on Nov 6 2025 7:30 AM

మహిళల రక్షణే షీటీం లక్ష్యం

మహిళల రక్షణే షీటీం లక్ష్యం

గోదావరిఖని: మహిళల రక్షణ కోసం షీటీంలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని, మౌనంగా ఉండకుండా బాధితులు ఫిర్యాదు చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా కోరారు. మహిళలు, యువతులు తమ సమస్యల గురించి పోలీసులను నిర్భయంగా సంప్రదించవచ్చన్నారు. కమిషనరేట్‌లో రెండు షీటీంలు ఉన్నాయని, ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌, ఆత్మహత్య లు, డ్రగ్స్‌, బాల్యవివాహాలు, వరకట్నం, నూతన మహిళా చట్టాలు, డయల్‌ 100 నంబరు, టీసేఫ్‌ యాప్‌, మహిళా భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై షీటీం బృందాలు అవగాహన కల్పిస్తున్నాయని ఆయన వివ రించారు. మహిళలు, బాలికలపై ఆన్‌లైన్‌లో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సైబర్‌ నేరగాళ్లపై కూడా సైబర్‌, షీటీంలు సమన్వయంతో నిఘా ఏర్పాటు చేశాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ షీటీం63039 23700, పెద్దపల్లి జోన్‌ షీటీం 87126 59386, మంచిర్యాల జోన్‌ షీటీం 87126 59386 నంబర్లకు కాల్‌చేసి సమాచారం ఇవ్వాలని, లేదా డయల్‌ 100 నంబరుకు కాల్‌చేసినా పోలీసులు తక్షణ సాయం అందిస్తారని సీపీ వివరించారు.

ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement