‘ఎమ్మెల్యేగా వ్యవహరిస్తే సహించేదిలేదు’
పాలకుర్తి(రామగుండం): ప్రజలు గెలిపించిన మ క్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ని ఎమ్మెల్యేగా స్వాగతిస్తు న్నామని, కానీ ఆయన సతీమణి మనాలీ ఠాకూర్ తానే ఎమ్మెల్యేను అనే రీతిలో వ్యవహరిస్తూ, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తే సహించేదిలేద ని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈసాల తక్కళ్లపల్లిలో బుధవారం బీఆర్‌ఎస్ మండల అధి కారి ప్రతినిధి ముల్కల కొమురయ్య తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మనాలీ ఠా కూర్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడం, ఇందిర మ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడం, ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోయడంలాంటి అధికారిక కార్యక్ర మాలను ప్రారంభించడం ఏమిటని నిలదీశారు. ఈ విషయంలో అధికారులు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతరెండేళ్లలో పాలకుర్తి మండలంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ గొప్పలు చెప్పడం తప్ప అన్నీ ఉత్తవే నని విమర్శించారు. ఈసాలతక్కళ్లపల్లి శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరు చేశామని ఎమ్మెల్యే ప్రకటించారని, నెలదాటి నా ఒక్కపనిని కూడా ప్రారంభిచలేదని ఎద్దేవా చేశా రు. బండి శ్రీనివాస్‌గౌడ్, శ్రావణ్, రాజయ్య, కొము రయ్య, శ్యాంసుందర్, రాయలింగు, కొమరయ్య, సుదర్శనం, అశోక్, రాజపోశం, హుస్సేన్ ఉన్నారు.
పాలకుర్తి బీఆర్‌ఎస్ నాయకులు
మక్కాన్‌సింగ్ సతీమణి తీరుపై నిరసన


