సబ్సిడీ గ్యాస్ పక్కదారి
రామగిరి(మంథని): జిల్లాలో గృహావసరాలకు వినియోగించాల్సిన రాయితీ వంటగ్యాస్ సిలిండర్లు బ్లా క్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. ఏజెన్సీల నిర్వా హకులు కొందరు వ్యాపారులతో కుమ్మకై అక్రమాల కు పాల్పడుతున్నారు. దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుని పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలువస్తున్నాయి.
హోటళ్లు. వాహనాలకు..
జిల్లాలోని టీస్టాళ్లు, హోటళ్లు, దాబాలు, హాస్టళ్లు, దు కాణ యజమానులతోపాటు వాహనాల్లోనూ సబ్సి డీ గ్యాస్ వినియోగిస్తున్నారు. జిల్లాలో సుమారు 2 లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ కనెక్షన్లు దాదాపు 50 వేల వరకు ఉన్నాయి. ప్రతీనెల జిల్లా లోని ఏజెన్సీల ద్వారా 70 వేల రీఫిల్లింగ్ సిలిండర్లు వినియోగదారులకు అందుతున్నాయి.
వాణిజ్యావసరాలకు సబ్సిడీ..
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, సు ల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోని హోట ళ్లు, ఇతర వ్యాపారాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగిస్తున్నారని సమాచారం. వీరికి వారానికి రెండు లేదా మూడు గ్యాస్ సిలిండర్‌లు అవసరమవుతాయి.
వాహనాలకూ వినియోగం..
కార్లు, ఇతర వాహనాల్లో పెట్రోల్‌కు బదులు గ్యాస్ సిలిండర్‌లు వినయోగిస్తున్నారు. నిబంధనల ప్రకా రం.. అనుమతి పొందిన కిట్‌లను వాహనాలకు అ మర్చుకోవాలి. కొందరు అనుమతి లేకుండానే కిట్లు అమర్చుకుని సబ్సిడీ గ్యాస్‌ను యథేచ్ఛగా ఫిల్లింగ్ చేసి వినియోగిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు.. సామాన్య వినియోగదారుల పేరిట గ్యాస్‌బుక్ చేసుకుని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు వి క్రయిస్తున్నారు. అంతేకాదు.. చిన్నగ్యాస్ స్టవ్‌లలో రీఫిల్లింగ్ చేస్తున్నారు. రీఫిల్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ధర వసూలు చేస్తున్నారు.
ధరల్లో వ్యత్యాసంతోనే..
గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌లను ప్రభుత్వం రాయితీపై వినియోగదారులకు రూ.877.50కే అందిస్తోంది. ఇంటివద్ద డెలవరీ చేస్తే సిబ్బంది అదనంగా కొంత నగదు తీసుకుంటారు. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,780 ఉంది. కేవలం ఐదు కేజీల వ్యత్యాసానికి అదనంగా రూ.900 నుంచి రూ.1,000 అధికంగా వెచ్చించాల్సి రావడంతో గృహావసరాలకు కేటాయించే రాయితీ గ్యాస్‌ను వాణిజ్యావసరాలకు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు.
తనిఖీలు నామమాత్రం..
సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల అధికారులు పర్యవేక్షించాలి. కానీ, వారు తనిఖీలు నామమాత్రంగానే చేస్తున్నారు. దీంతో రాయితీ గ్యాస్ పక్కదారి పడుతోంది. వందల కిలోమీటర్లు ప్రయాణించే వాహనాల్లోనూ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు
సింగిల్ సిలిండర్ 1,41,839
డబుల్ సిలిండర్ 80,789
దీపం 33,411
పీఎంయూవై 25,885
సీఎస్సార్ 16,518
వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్‌లు
యథేచ్ఛగా వినియోగిస్తున్న వ్యాపారులు
సబ్సిడీ గ్యాస్ పక్కదారి


