 
															చేతికొచ్చినా కోయలేదు
నాకున్న మూడెకరాల్లో ఈసారి వరి ఏసిన. పెట్టుబడి బాగానే వచ్చింది. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన. ఇప్పుడు వరి పంట కోతకు వచ్చింది.. మాయదారి తుపానుతో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట కోయలేదు. పంటంతా నేలవాలింది. పెట్టుబడి నీళ్లల్లో పోసినట్లయ్యింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– బీరం నర్సయ్య, ఓదెల
పత్తి నల్లబారింది
నాకున్న ఎనిమిదెరాల్లో పత్తి, వరి వేసిన. వర్షాలతో పత్తి నల్లబారింది. చేతికొచ్చిన వరిపంట కోయవద్దని అధికారులు చెబుతున్నరు. కోయక పోతే గింజరాలిపోయి చేతికొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలి.
– సుధాకార్‌రెడ్డి, రేగడిముద్దికుంట
అప్రమత్తంగా ఉండాలి
మోంథా తుపాను ప్రభావంతో వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. పంట చేలలో నీరు నిల్వఉండి మొక్కలు, వేర్లు కుళ్లిపోయే ప్రమా దం ఉంది. సాధ్యమైనంత వరకు నీటిని తొల గించాలి. వరి కోతలు, పత్తి ఏరడం వాయిదా వేసుకోవాలి. – శ్రీనివాస్, డీఏవో
 
							చేతికొచ్చినా కోయలేదు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
