 
															ఐదేళ్లుగా బీడు
తంగెళ్లకుంట కింద ఉన్న నా రెండెకరాలు ఐదేళ్లుగా బీళ్లు గానే ఉంటున్నయ్. వర్షాకాలంలో చెరువు నిండితే పంట వేస్తంది. అదికూడా చేతి కందేది నమ్మకం లేదు. ఈ సారి కూడా వడ్లు అలికినం. ఎండిపోయాయి. పొ లాలకు సరిపడా సాగునీళ్లు అందేలా చూడాలి.
– అక్కపాక శ్రావణ్, రైతు
మట్టికుప్పలతో ఇబ్బంది
తంగళ్లకుంటకు సమీపంలోనే సింగరేణి ఓపెన్‌కాస్టు మట్టి కుప్పలు ఉన్నయి. పొలాలకు నీరు వచ్చేందుకు వీలుకావడంలేదు. ఎవుసం బావిలో నీళ్లు ఉన్నన్నిరోజులు పంటలు వేసిన.
– దేవళ్ల విజయ్‌కుమార్, రైతు
ప్రణాళికలు సిద్ధం
టేలెండ్ ఏరియాలో సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేశాం. పత్తిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో ఎస్సారెస్పీ డీ–83, – 86 కాలువలను అనుసంధానిస్తాం. దీనిద్వారా టేలెండ్ ప్రాంత చివరి ఆయకట్టుకూ సాగునీరు అందుతుంది.
– బలరామయ్య,
ఈఈ, నీటిపారుదల శాఖ
 
							ఐదేళ్లుగా బీడు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
