మంత్రిపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదు
గోదావరిఖని: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వ్యక్తిగత విషయాలపై మంత్రిని నిందించడం సరికాదన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పా టుపడుతున్న శ్రీధర్‌బాబును దూషిస్తే ప్రజలే తగి న బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రజ ల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక గతంలో సీ తక్క, కొండా సురేఖ, ప్రస్తుతం శ్రీధర్‌బాబుపై ఆ రోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జూబ్లీహి ల్స్ ఎన్నికల్లో అభ్యర్థి ఓటమి ఖాయమని బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో వందమందికిపై గా నిరుద్యోగులకు ఉపాధి తానే కల్పించానని అ న్నారు. నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


