కోత విధిస్తే ఉద్యమం
ధర్మారం(ధర్మపురి): ధాన్యం తూకంలో కిలో కోత విధించినా రైతులతో కలిసి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. మల్లాపూర్‌లోని ధాన్యం కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. తడిసిన ధాన్యం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో కోతలు విధిస్తున్నా మంత్రి లక్ష్మణ్‌కుమార్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, రాసూరి శ్రీధర్, పుస్కూరి జితేందర్‌రావు, గందం రవీందర్, పాకాల రాజయ్య, ఎగ్గేల స్వామి, కూరపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకునే పిచ్చుకగూళ్లు
మంథనిరూరల్: తుమ్మచెట్టుకు పిచ్చుకలు క ట్టుకున్న గూళ్లు వేలాడుతూ కనువిందు చేస్తున్నాయి. తెల్లవారు జామున గిజిగాడి గూళ్ల నుంచి బయటకు వచ్చి సందడి చేస్తుంటాయి. వాటి అరుపులు వినసొంపుగా ఉంటుంది. పి చ్చుకలు ఎక్కువగా తుమ్మచెట్లకే గూళ్లు నిర్మించుకుంటాయి. మంథని మండలం ఉప్పట్లకు వెళ్లే రహదారిలో పోతారం చెరువు గట్టున ఉన్న తుమ్మ చెట్టుకు పదుల సంఖ్యలో పిచ్చుకగూళ్లు వేలాడుతుండగా ఇలా కనిపించాయి.
హక్కుల సాధనే లక్ష్యం
పెద్దపల్లి: కార్మికుల హక్కుల కోసం పోరాడేది సీఐటీయూ మాత్రమేనని ఆ యూనియన్ జి ల్లా కార్యదర్శి ముత్యంరావు అన్నారు. సుల్తానా బాద్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. నవంబర్ 15, 16వ తేదీ ల్లో జిల్లా కేంద్రంలో జిల్లామహాసభలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం సుల్తానాబాద్ మండల కన్వీనర్‌గా తాండ్ర అంజయ్య, సభ్యులుగా బ్రహ్మచారి, పూసాల సంపత్, మాతంగి రాజమల్లు, భగవాన్, ప్రశాంత్, ఆరేపల్లి సురేశ్, ఎండీ మంజూర్, ఆవునూరి కుమార్, పోగుల తిరుపతి, గున్నాల అన్నపూర్ణ, తుడిచెర్ల స్వరూప, నరసింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.
బీసీ జేఏసీ చైర్‌పర్సన్‌గా ఉష
పెద్దపల్లి: బీసీ సంఘాల జేఏసీ జిల్లా చైర్‌పర్స న్‌గా దాసరి ఉషను నియమించారు. ఈమేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఉషకు నియామకం పత్రం అందజేశారు. ఆమెను పలువురు అభినందించారు.
డబ్బులున్నవారికే పదవులా?
పెద్దపల్లి: బీసీల ఆత్మగౌరవాన్ని బీఆర్‌ఎస్‌కు కట్టబెట్టడం తనను మనస్తాపానికి గురిచేసిందని బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేత దాసరి ఉషను బీసీ జేఏసీ చైర్‌పర్సన్‌గా నియమించడం దారుణమన్నారు. డబ్బులతో నే బహుజన ఉద్యమాలు నడుస్తాయనే దానికి ఈ నియామకమే నిదర్శనమన్నారు. 20 ఏళ్లుగా బీసీ ఉద్యమాల్లో పాల్గొని, బహుజనులను ఐక్యం చేయడంలో శ్రమిస్తున్న తనను సంప్రదించకుండా చైర్మన్ పదవిని ఇతరులకు కట్టబెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఉషను ఆ పదవి నుంచి వెంటనే తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య తీరుకు నిరసనగా తాను అన్ని బీసీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు శ్రీమాన్ ప్రకటించారు. నాయకులు భూతగడ్డ సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, భూతగడ్డ అజయ్, ముక్కెర్ల రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.
కోత విధిస్తే ఉద్యమం
కోత విధిస్తే ఉద్యమం
కోత విధిస్తే ఉద్యమం
కోత విధిస్తే ఉద్యమం


