లక్కు ఎవరికో..?
అంతర్గాం
అదృష్టవంతులెవరో?
రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలో ని మద్యం దుకాణానికి అత్యధికంగా 45 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనిద్వారా ప్రభు త్వానికి రూ.1.35 కోట్ల ఆదాయం సమకూరింది. మరోమూడు నెలల్లో గోలివాడ శ్రీసమ్మక్క– సారలమ్మ జాతర ఉండడం, త్వరలో స్థానిక ఎన్నికలు జరుగుతాయనే కారణంతో ఇక్కడి దుకాణం ద్వారా అధిక ఆదాయం స మకూరుతుందని వ్యాపారులు భావించి, ఎ లాగైనా వైన్స్‌షాప్ దక్కించుకోవాలనే పట్టుదలతో అత్యధికంగా దరఖాస్తులు దాఖలు చేశా రని అంటున్నారు. సోమవారం జరిగే లక్కీలాటరీ ద్వారా ఈ దుకాణం ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
● నేడు మద్యం టెండర్ల లక్కీడ్రా ● దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
పెద్దపల్లి: మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 23వ తేదీతో ముగిసింది. వైన్స్‌షాపుల కేటాయింపే మిగిలింది. ఈనెల 27(సోమవారం) లక్కీడ్రా ద్వారా దుకాణాలు కేటాయిస్తారు. జిల్లాలోని 74 మద్యం దుకాణాల కోసం అధికారులు టెండర్లు ఆహ్వానించగా.. 1,507 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తు ద్వారా ప్రభుత్వానికి రూ.3లక్షల ఆదాయం సమకూరింది.
పారదర్శకంగా డ్రా..
వైన్స్‌షాపులు దక్కించుకునేందుకు అదేవ్యాపారంలో ఉన్నవారు అత్యధికంగా టెండర్లు వేశారు. టెండరు ఫీజు పెంచడంతో గ్రూపులుగా ఏర్పడి 5 నుంచి 10 షాపులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క షాపు దక్కినా అందరూ కలిసి వ్యాపారం చేసేలా ఒప్పందం చేసుకున్నారని ప్రచారంలో ఉంది.
మద్యం వ్యాపారుల్లో టెన్షన్..
డ్రాలో అదృష్టం వరిస్తుందా? లేదా? అనే టెన్షన్ వ్యాపారులను వెంటాడుతోంది. పూర్తిగా అదృష్టంపై ఆధారపడిన వ్యాపారం కావడంతో కొందరు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. మరికొందరు జాతకాలు చూపించుకుంటున్నారు. ముడుపులు కడుతున్నారు. అధిక సంఖ్యలో టెండర్లు దాఖలు చేసిన వారికై తే కంటిమీద కునుకు ఉండడం లేదు. వైన్స్ షాపుల లైసెన్స్ జారీ ప్రక్రియలో లాటరీ కేవలం అదృష్ట పరీక్ష మాత్రమే కాదు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక పెట్టుబడులు, మద్యం ప న్నులు, అనుబంధ పరిశ్రమల ద్వారా వచ్చే ఆ దాయం కూడా అనే భావన ఉంది. అందుకే అధికారులు పారదర్శకంగా డ్రా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తుదారులకు ఇప్పటికే పాసులు జారీచేశారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పెద్దపల్లి సమీపంలోని బందంపల్లి స్వరూప గార్డెన్స్‌లో డ్రా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి తెలిపారు.


