 
															నృసింహుని బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రచార పోస్టర్‌ను ఆలయ ఈవో శంకరయ్య తదితరులు ఆదివారం ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. నవంబర్ 2న బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. నవంబర్ 5న స్వామివారి కల్యాణం, 10న రథోత్సవం, జాతర నిర్వహిస్తామని అన్నారు. భక్తులు అధికసంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. అర్చకులు శ్రీకాంతచార్యులు, నాయకులు బొక్కల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
స్వయం సేవకుల కవాతు
గోదావరిఖని: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దపల్లి నగరశాఖ ఆధ్వర్యంలో ఆదివారం శతాబ్ది ప థసంచలన్ నిర్వహించారు. విభాగ ప్రతినిధి కొంప ల రాజన్న, విభాగ బౌద్ధిక్ ప్రముఖ్ సామల కిరణ్, జిల్లా కార్యవాహక్ గడ్డి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా కవాతు కొనసాగింది. ప్రాయకరావు నాగరాజు, గోపు మోహన్, జార తి సంతోష్, రామగిరి శ్రీనివాస్, కంచర్ల శ్రీనివాస్, దయాకర్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, గొట్టుముక్కుల సురేశ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, పవన్ చంద్రశేఖర్, చల్ల కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
 
							నృసింహుని బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
