 
															సీసీఐ కేంద్రాల్లోనే పత్తికి మద్దతు
పెద్దపల్లిరూరల్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీపీఐ) కేంద్రాల్లో విక్రయిస్తేనే పత్తికి మద్దతు ధర లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రాఘవాపూర్‌లోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో ఆదివారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పె ద్దపల్లి, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, జిల్లా మార్కెటింగ్ అధి కారి ప్రవీణ్‌రెడ్డి, కార్యదర్శి మనోహర్‌తో కలిసి ఎ మ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. వాతావరణ ప రిస్థితులతో ఈసారి పత్తి దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నారు. రైతుకు మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దళారులకు పత్తి విక్రయించి నష్ట పోవద్దని రైతులకు సూచించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాప్రతినిధులు, నేతల చేతిలో వరి రైతులు దగా పడ్డారని విమర్శించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్, డైరెక్టర్ ఎడ్ల మహేందర్, ముడుసు సాంబిరెడ్డి, మల్లారెడ్డి, సంపత్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
