 
															జీజీహెచ్‌లో స్కానింగ్ సెంటర్ తనిఖీ
కోల్‌సిటీ(రామగుండం): గోదా వరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లోని రేడి యాలజీ, గైనిక్ విభాగంలోని స్కానింగ్ మిషన్‌ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో) వాణిశ్రీ గురువారం తనిఖీ చేశారు. రేడియోలజిస్ట్ సమత నుంచి వివరాలు అడిగి సేకరించారు. స్కానింగ్ రికార్డులు, ఫారమ్ –ఎఫ్ రిపోర్టులు, స్కానింగ్ యంత్రం తయారీ, మోడల్, సీరియల్ నంబర్ తదితర వివరాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతీ గర్భిణికి స్కానింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా ఫారమ్ – ఎఫ్ నింపాలన్నారు. గర్భంలోని పిండం, శిశువు లింగ సమాచారం గురించి తాము అడుగబోమని డిక్లరేషన్ తీసుకోవాలి సూచించారు. స్కానింగ్ పొందిన వారి వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. ఫారమ్– ఎఫ్‌లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రతీనెల 5వ తేదీలోగా అందజేయాలని కోరారు. లింగ నిర్ధారణ చేసినా, చేయాలని అడిగినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తారని ఆమె హెచ్చరించారు.
నర్సింగ్ కాలేజీ సందర్శన..
గోదావరిఖని శారదనగర్‌లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని డీఎంహెచ్‌వో శ్రీవాణి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న అకడమిక్ వివరాలు, హాస్టల్‌లో సౌకర్యాలు తదితర వివరాలను ప్రిన్సిపాల్ ప్రసూన, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన డీఎంహెచ్‌వో.. విద్యా విధానం, సమస్యలపై ఆరా తీశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
