 
															రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సత్వరమే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడచినా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేదన్నారు. దీంతో అనేకమంది మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కొందరు కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వారికి ప్రయోజనాలు చెల్లించారని అన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించలేని వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పీఆర్సీ –2020 ఎరియర్స్, జీపీఎఫ్ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌రావు, దివాకర్ భారతి, రాంరెడ్డి, నర్సయ్య, మొగిలయ్య మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్
కలెక్టరేట్ ఎదుట నిరసన

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
