పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్/ఓదెల: ప్రభుత్వ కొను గోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యం డబ్బులను 24 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం, కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్‌లో డీసీఎంఎస్, ఓదెల మండలం పొత్కపల్లిలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి ప్రారంభించారు. పొత్కపల్లిలో ధాన్యం కొనుగోళ్లనూ ప్రారంభించి మాట్లాడారు. క్వింటాల్ మక్కలు రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఆయన సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు రాకేశ్, జగదీశ్వర్‌రావు, పౌర సరఫరాల డీఎం శ్రీకాంత్, డీసీవో శ్రీమాల, మార్కెట్ డీఎం ప్రవీణ్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్, పెద్దపల్లి ఏ ఎంసీ చైర్‌పర్సన్లు ప్రకాశ్‌రావు, స్వరూప, నాయ కులు సారయ్యగౌడ్, సబ్బని రాజమల్లు, గాజనవేన సదయ్య, లంక సదయ్య, ఆళ్ల సుమన్‌రెడ్డి, మూల ప్రేంసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
