 
															అమరవీరులను ఆదర్శంగా తీసుకోవాలి
మంథని: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను ఆదర్శంగా తీసుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రతీపౌరుడు బాధ్యతగా సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ముందుంటారని, ప్రజల సహకారం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సుమారు 150 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐలు రాజు, ప్రసాద్‌రావు, ఎస్సై రమేశ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కావేటి రాజగోపాల్, వైస్ చైర్మన్ తూము రవీందర్, లయన్స్ క్లబ్ మంథని అధ్యక్షుడు మేడగోని వెంకటేశ్, నాయకులు ఐలి ప్రసాద్, కుడుదుల వెంకన్న, శశిభూషణ్ కాచే, వొడ్నాల శ్రీనివాస్, పోతరవేణి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
